Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో పండగ పూట విషాదం నెలకొంది. అన్న రాఖీ కట్టుకునేందుకు నిరాకరించడంతో చెల్లె ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ ప్రభు వీధిలో మమత (22) అనే యువతి తన అన్న రమేష్ కు రాఖీ కట్టేందుకు వెళ్లింది. అయితే అక్కడ రాఖీ కట్టుకునేందుకు అన్న నిరాకరించాడు. దాంతో మనస్తాపం చెందిన మమత ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జహీరాబాద్ పట్టణ ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.