Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అస్సాం, మిజోరాం మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్నది. తాజాగా అస్సాం పోలీసులపై మిజోరాం పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు. వివాదస్పద సరిహద్దు ప్రాంతమైన కొలసిబ్ జిల్లాలో నిర్మాణ సామగ్రిని అస్సాం పోలీసులు దొంగిలించారని మిజోరాం ప్రభుత్వం ఆరోపించింది. కొలసిబ్ జిల్లా బైరాబి సబ్ డివిజన్లో మిజోరాం పరిధిలోని జోఫై ప్రాంతంలోకి అస్సాం పోలీసు సిబ్బంది శుక్రవారం ప్రవేశించారు. కాగా, అక్కడ నిర్మిస్తున్న వంతెనకు సంబంధించిన సామగ్రి మాయం కావడంతో అస్సాం పోలీసులపై మిజోరాం అధికారులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అసోం పోలీసులు సైట్లోని కార్మికులకు సమస్యలు సృష్టించారు. ఇనుప రాడ్లతో సహా కొన్ని నిర్మాణ సామగ్రిని కూడా దొంగిలించారు. బైరాబి పోలీస్ స్టేషన్లో వారిపై నిర్మాణ సామగ్రి దొంగతనం కేసు నమోదైంది అని జిల్లా డిప్యూటీ కమిషనర్ లాల్త్లాంగ్లియానా తెలిపారు.