Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో నేటి నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీలో వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ, కంటోన్మెంట్ బోర్డు, జీహెచ్ఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. 10 నుంచి 15 రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ కొనసాగనుందని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్ కోసం మొత్తం 175 సంచార టీకా వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 150 సంచార టీకా వాహనాలు.. కంటోన్మెంట్ పరిధిలో 25 మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీలో 4,846 కాలనీలు, బస్తీల్లో.. కంటోన్మెంట్ పరిధిలోని 360 ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుంది. ప్రత్యేక డ్రైవ్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి టీకాలు వేసుకోని వారిని వివరాలను సైతం సిబ్బంది గుర్తించనున్నారు. ఇప్పటికే గ్రేటర్లో 18 ఏండ్లు నిండిన వారిలో 70 శాతానికిపైగా టీకా వేసుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.