Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అఫ్గానిస్థాన్ తాలిబన్ల గుప్పెట్లో చిక్కుకోవడంతో ఆ దేశంలో పరిస్థితులు దయనీయంగా మారాయి. తాలిబన్ల అరాచకాలకు గురి కాకుండా ఉండడం కోసం అక్కడున్న మన దేశ పౌరులను సేఫ్‌గా తరలించేందుకు భారత ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ చేపడుతోంది. అయితే అక్కడ చిక్కుకున్న మనవాళ్లతో పాటు అఫ్గాన్‌కు చెందిన మైనారిటీలను కూడా శరణార్థులుగా కాపాడి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఆదివారం ఉదయం 168 మందిని కాబూల్ నుంచి ఢిల్లీకి తరలించారు. ఇందులో 107 మంది ఇండియన్స్ ఉండగా, మిగిలిన వాళ్లు అఫ్గాన్లు, ఇతర దేశాల వాళ్లు ఉన్నారు. అయితే ఈ క్రమంలో అన్ని రకాలుగా భారత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మన దేశంలోకి పోలియో మహమ్మారి ప్రవేశించకుండా ఉండేందుకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.