Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : శామీర్పేటలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఓ ద్విచక్ర వాహనదారుడి నిర్లక్ష్యం, మరొకరి అతి వేగం కలిసి ఇంకొకరి మరణానికి కారణమయ్యాయి. ఓ మహిళతో బైక్పై వస్తున్న వ్యక్తి రోడ్డు దాటే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వాహనాలను గమనించకుండానే ఉన్నట్టుండి జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో అత్యంత వేగంగా వస్తున్న మరో వ్యక్తి నియంత్రించుకునే సమయం లేక ఆ బైక్ను ఢీకొట్టాడు. ఆ వేగానికి బైక్లు నుజ్జు కాగా, ముగ్గురూ ఎగిరి పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.