Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఒక్క చలానా పెండింగ్లో ఉన్నా వాహనాన్ని జప్తు చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదని.. తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్ట్ అవాస్తవమని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తేల్చారు. హైకోర్టు అలాంటి ఆదేశాలు ఏమీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, ప్రజలను గందరగోళానికి గురి చేస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని ఆపేయాలని హెచ్చరించారు.
సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ (సీఎంవీఆర్)-1989 రూల్ 167 ప్రకారం 90 రోజులకు పైగా ట్రాఫిక్ చలానాలు పెండింగ్ ఉన్న వాహనాలను అదుపులోకి తీసుకునే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సంబంధిత పెండింగ్ చలానా గురించి వాహనదారునికి ఎలక్ట్రానిక్ రూపంలో లేదా కాల్ ద్వారా పోలీసులు ఒక్కసారైనా తెలియజేస్తే చాలని పేర్కొన్నారు.