Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 24,850 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరడంతో అధికారులు ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి 18,720 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 7500 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1090.8 అడుగుల మేర నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటనిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 89.12 టీఎంసీలుగా ఉంది.