Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 21,432 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 25,342 క్యూసెక్కుల నీరు బయటకి వెళ్తున్నది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 588.20 అడుగుల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ 312.0450 టీఎంసీలు. ప్రస్తుతం 306.6922 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 25,368 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో 38,478 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 878 అడుగులకు చేరింది. గరిష్ఠ సామర్ధ్యం 215 టీఎంసీలకు గాను, ప్రస్తుత నిల్వ 178 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.