Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ముంబైలోని మంత్రాలయం బయట విషం తాగిన పూణే రైతు మరణించారు. పుణే నగరానికి చెందిన సుభాష్ జాదవ్ (48) అనే రైతు శుక్రవారం మంత్రాలయ ద్వారం బయట విషం తాగాడు. రైతును వెంటనే జీటీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మరణించాడని వైద్యులు చెప్పారు. తను వ్యవసాయ భూమిని కొంతమంది స్వాధీనం చేసుకున్నారని రైతు జాదవ్ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. కాని పోలీసులు దీనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. దీంతో జాదవ్ తనకు న్యాయం చేయాలని కోరేందుకు వీలుగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, హోంశాఖ మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ ను కలిసేందుకు మంత్రాలయం వచ్చారు.మంత్రులను కలిసేందుకు లోపలకు అనుమతించక పోవడంతో జాదవ్ మంత్రాలయం గేటు వద్ద విషం తాగాడు. అనంతరం చికిత్స పొందుతూ రైతు జాదవ్ మరణించాడు. రైతు జాదవ్ కుమారుడు గణేష్ ఫిర్యాదుపై పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.