Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 32 వేల కేసులు నమోదవగా, తాజాగా 25 వేలకు తగ్గాయి. ఇది నిన్నటి కంటే 19 శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా గతేడాది మార్చి తర్వాత యాక్టివ్ కేసులు భారీగా తగ్గాయని తెలపింది. ఇప్పటివరకు 58.25 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 25,072 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,24,49,306కు చేరింది. ఇందులో 3,16,80,626 మంది బాధితులు కోలుకోగా, మరో 4,34,756 మంది మహమ్మారికి బలయ్యారు. ఇక మొత్తం కేసుల్లో 3,33,924 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 44,157 మంది కోలుకోగా, 389 మంది కన్నుమూశారు.