Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో అందరికీ టీకాలే లక్ష్యంగా ప్రత్యేక కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమయ్యింది. వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డులు సంయుక్తంగా ఈ ప్రక్రియ చేపట్టాయి. ఇందులో భాగంగా అర్హులైన అందరికి టీకా పంపిణీ చేయనున్నారు. దీనికోసం ఇంటింటికి తిరుగుతూ వైద్యారోగ్య శాఖ సిబ్బంది వ్యాక్సినేషన్ స్లిప్‌లు పంపిణీ చేస్తున్నారు. మొబైల్ వాహనాలతో వీధుల్లో తిరుగుతూ జీహెచ్ఎంసీ ప్రచారం నిర్వహిస్తున్నది. ఖైరతాబాద్ ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌లో వ్యాక్సినేషన్‌ను సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. వ్యాక్సిన్ కోసం వచ్చినవారితో మాట్లాడారు. కరోనా తొలి డోసును ఎందుకు వేసుకోలేదని అడిగి తెలుసుకున్నారు. కాగా, ప్రత్యేక డ్రైవ్ కోసం మొత్తం 175 సంచార టీకా వాహనాలు ఏర్పాటు చేశారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 150 సంచార టీకా వాహనాలు.. కంటోన్మెంట్ పరిధిలో 25 మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో 4,846 కాలనీలు, బస్తీల్లో.. కంటోన్మెంట్ పరిధిలోని 360 ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుంది. నగరంలో ఇప్పటికే 18 ఏండ్లు నిండిన వారిలో 70 శాతానికిపైగా టీకా వేసినట్లు అధికారులు తెలిపారు.