Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం తమ ప్రభుత్వ పాలనలో ఆర్థికవృద్ధి సాధిస్తోందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలనలో భారత ఆర్థిక వృద్ధి బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉందని విమర్శించారు. భారత్ తలసరి ఆదాయం కంటే బంగ్లాదేశ్ తలసరి ఆదాయమే ఎక్కువని గుర్తు చేశారు. తెలంగాణ మాత్రం ఆర్థిక వృద్ధిని సాధిస్తూ దూసుకుపోతోందని తెలిపారు. రాష్ట్రం 11.7 శాతం ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేసిందని, తలసరి ఆదాయంలోనూ వృద్ధి సాధించిందిని తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,37,632గా ఉందని, ఇది దేశ తలసరి ఆదాయం కంటే 1.84 రెట్లు ఎక్కువ అని తెలిపారు. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న మూడో రాష్ట్రం తెలంగాణ చెప్పారు. గత ఏడేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని తెలిపారు. ఆరేళ్లలో దేశం 8 శాతం వృద్ధి రేటు సాధించిందని, దేశం కంటే తెలంగాణ 3 శాతానికి పైగా వృద్ధి రేటు సాధించిందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాల వల్లే వృద్ధి రేటు సాధ్యమైందని ఆయన తెలిపారు.