Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 25కు వాయిదా వేసింది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పిటిషన్లపై ఎల్లుండి విచారణ చేపట్టనున్నట్లు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరి ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రత్యేక న్యాయస్థానం సెప్టంబరు 6 నుంచి మిగతా సాక్షులందరి వాంగ్మూలాలు నమోదు చేసేలా షెడ్యూల్ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. సుప్రీ కోర్టును ఆశ్రయించారు.