Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆర్టీసీపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, సీఎస్, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆదాయంతో పాటు ఖర్చు, అప్పుల వివరాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్టీసీ ఆదాయం భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి రోజూ రూ.9 కోట్ల ఆదాయం సమకూరుతోందని మరో రూ.2 నుంచి రూ.3 కోట్ల ఆదాయం పెంచుకోగలితే సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందనిని చెప్పారు. ఆర్టీసీకి బడ్జెట్లో రూ.1,500 కోట్లు, ఇతర నిధులు రూ.1,500 కోట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించారని మంత్రి తెలిపారు.