Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో అక్బోబర్ లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కమిటీ హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయానికి నివేదిక అందించింది. చిన్నారులు పెద్ద ఎత్తున కోవిడ్ బారిన పడే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. అయితే వారు కరోనా బారిన పడితే దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు ఏ మాత్రం సరిపోవని ఎన్ఐడీఎం కమిటీ పేర్కొంది. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది. పిల్లలకు వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని సూచించింది. వ్యాక్సినేషన్ చేయడం వల్ల థర్డ్ వేవ్ ఉధృతిని కొంత తగ్గించవచ్చని తెలిపింది. పిల్లలతో పాటు వారి సంరక్షకులు కూడా ఉండేలా కొవిడ్ వార్డుల్లో మార్పులు చేయాలని కమిటీ సూచించింది. ఇతర వ్యాధులు, వైకల్యం గల పిల్లలను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది.