Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తన ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి ఫొటోలను వాట్సాప్లో షేర్ చేసిన యువకుడిని సోమవారం హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకెళ్తే.. చాంద్రాయణగుట్టకు చెందిన ఓ 19 ఏండ్ల యువతి స్థానికంగా ఓ ఇంట్లో ఇంటి పనులు చేస్తోంది. అయితే ఆ ఇంటి యజమాని 23 ఏండ్ల కుమారుడు కొన్ని రోజులుగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అలాగే ఆమె ఫొటోలను తీసి తన వాట్సాప్లో షేర్ చేస్తున్నాడు. అది తెలుసుకున్న బాధితురాలి తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.