Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆగస్టు 31 నాటికి సైన్యాల సైన్యాల ఉపసంహరణ పూర్తి చేయకుండా అమెరికా, బ్రిటన్లు ఇంకా అదనపు సమయం కోరితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ దేశాలను తాలిబన్లు హెచ్చరించారు. తాలిబన్ల అధికార ప్రతినిధి సుహెల్ షాహీన్ తాజాగా ఒక ప్రకటన జారీ చేశారు. ఆగస్టు 31 డెడ్లైన్ పొడిగించే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఆగస్టు చివరికల్లా కల్లా పూర్తిస్థాయిలో తమ బలగాలను ఉపసంహరిస్తామని అమెరికా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సైన్యాల ఉపసంహరణకు మరికొంత సమయం పట్టొచ్చంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాలిబన్లు ఈ ప్రకటన జారీ చేసినట్టు తెలుస్తోంది.