Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ చేస్తున్న పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. జిల్లాలోని వీణవంక మండలం వల్బాపూర్లో ఈటల రాజేందర్ సమక్షంలో పలువురు ఇతర పార్టీల కార్యకర్తలు బీజేపీలో చేరారు. అయితే స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ ఆ ఫోటోలను తీశాడు. ఈ క్రమంలో ఆయనతో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. వాగ్వాదంలో ఏఎస్ఐ చొక్కా చిరిగింది.