Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సినిమా థియేటర్స్ అసోసియేషన్ పై తె ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఎగ్జిబిటర్లు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిర్మాత దిల్ రాజు, ఠాగూర్ మధు సహా పలువురు అగ్ర నిర్మాతలతో కూడిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది సినిమా థియేటర్స్ అసోసియేషన్ సభ్యులు వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని పేర్కొంది. సినిమాపై పూర్తి హక్కు, అధికారం నిర్మాతలకే ఉంటుందని, వారి సినిమా ఎక్కడ, ఎప్పుడు విడుదల చేసుకోవాలో వారి ఇష్టమని తెలిపింది. డిమాండ్ ఉన్న పెద్ద సినిమాలపైనే ఎగ్జిబిటర్లు దృష్టి పెడుతున్నారని, చిన్న సినిమాలను పట్టించుకోవట్లేదని నిర్మాతల గిల్డ్ ఆరోపించింది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లందరూ కలిసి ఉంటేనే సినీ పరిశ్రమ మనుగడ సాధ్యమవుతుందని సూచించింది. కలిసి కట్టుగా అందరం పనిచేసి తెలుగు సినీపరిశ్రమ అభివృద్ధికి పాటుపడదామని ప్రకటనలో నిర్మాతల గిల్డ్ కోరింది.
నాని నటించిన చిత్రం టక్ జగదీశ్ వచ్చే నెల 9న ఓటీటీలో రానుందన్న వార్తలపై మూవీ థియేటర్స్ అసోసియేషన్ సభ్యులు ఇటీవల హీరో నానిపై, ఆ చిత్ర నిర్మాతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.