Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రైతుల రుణమాఫీ లో భాగంగా ఆరో రోజు రూ.63.05 కోట్లు రైతుల ఖాతాలో జమచేసినట్టు వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తద్వారా 20,663 మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ నిధులు అందినట్టు తెలిపారు. ఇప్పటి వరకూ 94,695 మంది రైతుల ఖాతాలలో రూ.275.31 కోట్లు జమ చేసినట్టు మంత్రి చెప్పారు. ఈ నెల 30 వరకు మొత్తం 6.08 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తామని తెలిపారు.రో