Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రస్తుతం సెల్ ఫోన్ లు నిత్యావసరమైపోయాయి. ఆన్ లైన్ క్లాసుల నేపథ్యంలో అవి పిల్లలకు కూడా ఇప్పుడు కచ్ఛితంగా అవసరమే అయితే ఇప్పుడు ఆ సెల్ ఫోన్లే నలుగురు పిల్లల ప్రాణాలు తీశాయి. రైలు పట్టాలపై కూర్చుని మొబైల్ ఫోన్ లలో ఆటల్లో మునిగిపోయిన ఓ నలుగురు బాలలపై నుంచి రైలు దూసుకెళ్లింది. దాంతో వాళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కొల్ కతా రాష్ట్రంలోని ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లా ఇస్లాంపూర్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
ఇస్లాంపూర్ ఎస్పీ సచిన్ మక్కర్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు బాలురు ఆదివారం రాత్రి రైలు పట్టాలపై కూర్చొని మొబైల్ ఫోన్ చూస్తుండగా రైలు వచ్చింది. దాన్ని గమనించకపోవడంతో వారిపై నుంచి రైలు దూసుకెళ్లింది. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే మృతదేహాల్ని అక్కడి గ్రామస్తులు ఖననం చేశారు. ఎవరూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. అనంతరం రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చీకటి ఉండడంతో మళ్లీ సోమవారం ఉదయం అక్కడ వెతికారు. అయితే అక్కడ వారికి చెల్లా చెదురైన మొబైల్ ఫోన్ల విడిభాగాలు లభించాయి. అప్పటికే గ్రామస్తులు..పిల్లల మృతదేహాలను ఖననం చేసినట్టు ఓ అధికారి తెలిపారు. తమకు ఫిర్యాదు అందితే ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని ఎస్పీ సచిన్ తెలిపారు.