Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి అన్ని విద్యా సంస్థలు పునఃప్రారంభించాలని నిర్ణయించింది. సోమవారం సీఎం కేసీఆర్..మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నిర్ణయంతో రాష్ర్టంలో సెప్టెంబర్ 1 అన్ని విద్యా సంస్థలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభణ తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరో తెలుగు రాష్ర్టం ఏపీలో గతవారమే పాఠశాలలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.