Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ఏపీ మధ్య వివాదం ముదురుతోంది. తాజాగా వెలిగొండ ప్రాజెక్టును ఏపీ అక్రమంగా నిర్మిస్తోందని కృష్ణా బోర్డుకు రాష్ట్ర ఈఎన్సీ లేఖ రాసింది. వెంటనే ఆ ప్రాజెక్టు పనులను నిలిపివేయించాలని కేఆర్ఎంబీ చైర్మెన్‌ను కోరింది. తాగునీటికి వినియోగించే జలాలు 20 శాతం మాత్రమే లెక్కించాలని విజ్ఞప్తి చేసింది.
విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఏపీ ఫిర్యాదు
శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ.. అవసరం లేకున్నా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శికి ఏపీ జలవనరుల శాఖ ఇంజినీరింగ్ చీఫ్ లేఖ రాశారు. అవసరం లేకున్నా విద్యుత్ ఉత్పత్తి చేయటం వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటిమట్టం 854 అడుగులకు చేరితే రాయలసీమకు నీరివ్వలేమని అన్నారు. తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నై నగరానికి కూడా తాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. విద్యుత్ ఉత్పాదన ద్వారా విడుదలవుతున్న నీటిని నాగార్జునసాగర్‌లో తెలిపారు కూడా నిలిపే అవకాశం లేదని లేఖలో తెలిపారు. ఫలితంగా విలువైన జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయన్నారు. విద్యుత్ ఉత్పాదనను తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేఆర్ఎంబీని కోరారు.