Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్పెషల్ బ్రాంచి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎనిమిది మంది బీజేపీ కార్యకర్తలపై కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్భాపూర్లో కేసు నమోదైంది. సోమవారం వల్భాపూర్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమాన్ని స్పెషల్ బ్రాంచికి చెందిన ఏఎస్ఐ బాపురెడ్డి ఫోటోలు, వీడియోలు తీస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో వారి మధ్య తోపులాట జరిగింది. స్పెషల్ బ్రాంచీ ఏఎస్ఐ బాపురెడ్డి పై వల్భాపూర్కు చెందిన బీజేపీ కార్యకర్తలు జీడీ రాజు, దొమ్మటి రాజమల్లు, నలబాల మధు, మారముల్ల సదయ్య, విజేందర్, శివయ్య, జీడీ మోహన్, దొమ్మటి శ్రీనివాస్ లు దాడి చేశారు. దాంతో ఆయన చొక్కా చిరిగినట్టు తెలిసింది. ఆయన ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. అనంతరం ఏఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.