Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రగతిభవన్‌లోకి ప్రవేశం లేని మంత్రి హరీశ్‌రావుతో నీతులు చెప్పించుకునే స్థితిలో తాము లేమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ధనిక రాష్ట్రమైతే ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఎందుకు ఇవ్వట్లేదని, నిరుద్యోగ భృతి ఎందుకు అమలు చేయట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు పేదలపై ప్రేమ ఉంటే గ్యాస్ సిలిండర్‌పై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న 291రూపాయల పన్ను, ట్రోల్, డీజిల్‌పై వసూలు చేస్తున్న రూ. 26.50 సుంకాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మోస పూరిత మాటలను నమ్మి ఏకగ్రీవంగా ఎన్నికైన దళిత సర్పంచ్ సొంత ఖర్చులతో గ్రామాన్ని అభివృద్ధి చేశారని కానీ వారికి ఇంత వరకూ వారికి నిధులివ్వలేదు అని మండిపడ్డారు.రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సాయంపై అమరవీరుల స్తూపం వద్ద హరీశ్ రావుతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.