Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఈ నెల 27వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరికను వాతావరణ కేంద్రం జారీచేసింది. పశ్చిమ మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉన్న ఉపరితల ద్రోణి బలహీనపడగా, నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈ నెల 27వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.