Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నేడు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా దళిత బంధు పథకం పై సీఎం కేసీఆర్.. పార్టీ శ్రేణులకు వివరించనున్నట్టు సమాచారం. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర కమిటీ ఏర్పాటుకు నిర్దిష్ట గడువును ప్రకటించనున్నారు. అలాగే హుజురాబాద్ ఎన్నిక తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ భేటి నేడు మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది.