Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : శ్రావణమాసంలో తన భర్త చికెన్ తిన్నాడని ఓ మహిళ క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ఛత్తీస్ ఘఢ్ లోని సూరజ్ పుర్ లో కరౌదా గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రామ్ జనమ్ సింహ్ ఈ నెల 22న రక్షాబంధన్ సందర్భంగా తన బంధువులతో కలిసి చికెన్ తిన్నాడు. అయితే ఇది తెలిసిన అతని భార్య.. శ్రావణ మాసంలో భర్త చికెన్ తినడాన్ని తట్టుకోలేకపోయింది. వెంటనే ఇంట్లో ఉన్న కిరోసిన్ ను ఒంటిపై పోసుకుని నిప్పం టించుకుంది. అది గమనించిన భర్త.. ఆమెను రక్షించేందకు యత్నించాడు. కానీ అప్పటికే ఆమె శరీరం చాలా వరకు కాలిపోయింది. వెంటనే ఆమెను కుటుంబసభ్యుల సాయంతో అంబికాపుర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది.