Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జపాన్ లోని టోక్యోలో మరో విశ్వ క్రీడా సంబరం జరగబోతోంది. నేడు మంగళవారం నుంచి 16వ పారాలింపిక్స్ జరగనున్నాయి. వైకల్యం శరీరానికే కాని. 4500 మంది పారా అథ్లెట్లు సిద్ధంగా ఉండగా మన భారత్ నుంచి 54 మంది పతాకాల వేటకు సిద్ధమయ్యారు. ఈరోజు భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 4 : 30గంటలకు ఓపెనింగ్ సెరిమనీ జరగనుంది. ఈ సారి మొత్తం 22 క్రీడల్లో 540 పతక ఈవెంట్లుండగా 163 దేశాల నుంచి 4500 అథ్లెట్లు పోటీ పడుతున్నారు. భారత్ రేపు తన పతకాల వేటను మొదలు పెట్టనుంది.
ఉత్సాహంగా మనోళ్లు :
2016 పారాలింపిక్స్‌లో యువ పారాఅథ్లెట్ మరియప్పన్ తంగవేలు హైజంప్‌లో పసిడి నెగ్గగానే.. స్వదేశంలో అతడికి స్టార్డమ్ వచ్చేసింది. తమిళనాడు ప్రభుత్వం రూ.2 కోట్ల నజరానాతో నగదు ప్రోత్సా హకాల వెల్లువకు తెరతీసింది. అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్న, పౌర పురస్కారం పద్మ శ్రీ సహా అర్జున అవార్డులు వరించాయి. రియో పారా మెడలిస్ట్లు దేవేంద్ర జఝారియ, దీప మాలిక్, వరుణ్ సింగ్‌లకు స్వదేశంలో అదే గౌరవం దక్కింది. జీవితంలో ఎన్నో వైపరిత్యాలను జయించిన పారా వీరులు.. 2020 పారాలింపిక్స్‌కు సిద్ధమవుతున్నారు. విశ్వ క్రీడా వేదికపై మెడల్ ప్రదర్శనతో జీవితం మారిపోయే సువర్ణావకాశం ముందుండటంతో పారా అథ్లెట్లు ఉత్సాహంగా బరిలోకి దిగుతున్నారు. తొలిసారి భారత్ 54 మంది పారా అథ్లెట్లను పంపిస్తోంది. మరియప్పన్ తంగవేలు, దేవంద్రలు పసిడి పతకాన్ని నిలుపుకునేందుకు బరిలోకి దిగుతుండగా.. పారాలింపిక్స్‌లో తమ ప్రతాపం చూపేందుకు ఇతర అథ్లెట్లు సిద్ధపడుతున్నారు. పారా షట్లర్ ప్రమోద్ భగత్ తన విభాగంలో వరల్డ్ నం.1. 33 ఏండ్ల ప్రమోద్ తన విభాగంలో పసిడి ఫేవరేట్‌గా ఆడుతున్నాడు. బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ పారా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో వరుసగా బంగారు పతకాలు సాధించిన ప్రమోద్.. టోక్యోలో మరో పసిడి దిశగా స్మాష్ కొట్టనున్నాడు. షుటింగ్ విభాగంలోనూ భారత్ పతకాలు ఆశిస్తోంది. అవని, రూబినాలు గన్‌తో పతకం కొట్టేందుకు రెఢ అవుతున్నారు. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ నుంచి 54 పారా అథ్లెట్లు బరిలో ఉన్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, పవర్‌లిఫ్టింగ్, పారాకానోయింగ్, పవర్‌లిఫ్టింగ్, షుటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండోల్లో భారత పారా అథ్లెట్లు మెడల్ రేసులో ఉన్నారు.
పారా అథ్లెట్లు నిజ జీవిత హీరోలు : సచిన్
పారా అథ్లెట్లు నిజ జీవిత హీరోలు అని క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. ఆయన పారా అథ్లెటిక్స్ పై స్పందిస్తూ.. టోక్యోలో పతకాలు సాధించినా, సాధించకపోయినా టోక్యోలో బరిలోకి దిగుతున్న 54 మంది పారా అథ్లెట్లూ విజేతలే అని అన్నారు. వారికి దేశమంతా అండగా నిలవాలని కోరాడు. అందరూ వారి నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. ఈసారి పది పతకాలు వస్తాయంటున్నారు. కానీ ఇంకా ఎక్కువే గెలుస్తామనుకుంటున్నా అని మాస్టర్ బ్లాస్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.