Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఓ పేపర్లో 'ఐయామ్ సో బ్యాడ్ డాటర్.. మిస్ యూ నాన్న.. అమ్మ` రాసి ఉంది. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా.. ఇది ఆత్మహత్యా.. హత్యా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన రఘుశాల లచ్చయ్య, రజిత దంపతుల కూతురు మౌనిక(27). లచ్చయ్య గ్రామంలో వ్యవసాయం చేస్తుంటాడు. పదో తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ బడిలో చదువుకున్న మౌనిక... ఆ తర్వాత బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించింది. అక్కడ ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని హెచ్‌సీయూలో ఎంటెక్‌లో చదువుతోంది. నానో టెక్నాలజీ సెకండ్ ఇయర్ చదువుతూ క్యాంపస్‌లోనే మహిళా హాస్టల్-7లో ఆమె ఉంటోంది. అయితే కరోనా తగ్గడంతో ఎంటెక్ విద్యార్థులను క్యాంపస్‌లోకి ఈ మధ్యే అనుమతించారు. దాంతో ఆమె ఈనెల 18న హాస్టల్ గదికి వచ్చి ఉంటోంది. అయితే సోమవారం ఉదయం నుంచి గదిలోంచి మౌనిక బయటకు రాలేదు. దాంతో తోటి విద్యార్థులు అనుమానంతో వెంటిలేటర్లోంచి చూశారు. మౌనిక కిటికీ చువ్వకు ఉరివేసుకుని కనిపించడంతో వెంటనే కాలేజ్ మేనేజ్ మెంట్ కు , పోలీసులకు సమాచారం అందిచారు. పోలీసులు వచ్చి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు రాశారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.