Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాష్ట్రంలోని దళిత, గిరిజన కుటుంబాలన్నింటికీ దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంగళవారం 48 గంటల దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్ష చేపట్టనున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడు చింతలపల్లిలో జరిగే ఈ దీక్ష ఉదయం 10 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ దీక్షలో రేవంత్‌తో పాటు.. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిసింది. ఇప్పటికే దీక్షాస్థలి దగ్గర ఏర్పాట్లను సోమవారం టీపీసీసీ నేతలు పరిశీలించారు.