Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం కోచ్ రవిశాస్త్రి .. టీ20 వరల్డ్ కప్ తర్వాత తన పదవీ కాలం ముగుస్తున్నదని.. ఇకపై ఆ పదవిలో కొనసాగబోనని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దాంతో భారత జట్టు తర్వాతి కోచ్ ఎవరనే విషయం చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ ఫస్ట్ టర్మ్ కూడా త్వరలో ముగియనుండడంతో ఆయన తర్వాతి భారత హెడ్ కోచ్ అని అంతా అనుకున్నారు. అయితే తాజాగా రాహుల్ ద్రవిడ్ మరోసారి ఎన్ఏసీ చీఫ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఎన్ఏసీ చీఫ్ గా ఒకరు రెండేండ్లు పని చేసే అవకాశం ఉన్నది. దాంతో ద్రవిడ్ మరోసారి ఎన్ఏసీ చీఫ్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో టీమ్ ఇండియా హెడ్ కోచ్ రేసు నుంచి ద్రవిడ్ తప్పుకున్నట్టే. ఇక ద్రవిడ్ తప్పుపోవడంతో ఇప్పుడు భారత జట్టు ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ హెడ్ కోచ్ రేసులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.