Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం నుంచి నాలుగురోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రుతుపవన ద్రోణి పశ్చిమ నుంచి క్రమంగా ఉత్తరం వైపునకు మారే అవకాశం ఉందని దీనివల్ల పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తమిళనాడు, కేరళ, మహారాష్ట్రాల్లో ఆగస్టు 26,27 తేదీల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.ఆగస్టు 27వతేదీ వరకు బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయన్ ప్రాంతాలు, పశ్చిమబెంగాల్ లలో భారీవర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. 25వ తేదీ వరకు అసోం, మేఘాలయ ప్రాంతాల్లోనూ భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.