Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : న్యూజిలాండ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో లాక్‌డౌన్‌ను ఈ శుక్రవారం వరకు పొడగించాలని న్యూజిలాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వైరస్ కేసులు అధికంగా ఉన్న ఆక్లాండ్‌లో ఈ నెల చివరి వరకు లాక్డౌన్ ఉంటుందని ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు. చాలా రోజుల తర్వాత దేశంలో ఓ వైరస్ కేసు బయటపడగా అప్పటి నుంచి లాక్ డౌన్ విధించారు. ఇప్పటివరకు 107 ఇన్ఫెక్షన్ కేసులను అధికారులు గుర్తించారు.