Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 కింద దేశవ్యాప్తంగా 363 ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు నమోదైనట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ (ఏడీఆర్) తెలిపింది. 2019 నుంచి 2021 వరకు 2,495 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమర్పించిన ప్రమాణ పత్రాలను పరీక్షించి ఆ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో 296 మంది ఎమ్మెల్యేలు, 67 మంది ఎంపీలు ఉన్నారు.
ఈ నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో తొలి బీజేపీ నుంచి ఎక్కువగా ఉన్నారు, కాంగ్రెస్, తృణమూల్ ఆ తర్వాత స్థానంలో ఉన్నట్టు సంస్థ తెలిపింది. 83 మంది బీజేపీ సభ్యులు కాగా ఆ తర్వాత 47 మంది సభ్యులతో కాంగ్రెస్, 25 మంది సభ్యులతో తృణమూల్ కాంగ్రెస్ ఉన్నాయి. ఆ తర్వాత తెలుగు రాష్ర్టాలకు చెందిన వైకాపా (22) ఉంది. ఇంక బీజేడీ (22)లు ఉన్నాయి.
తెలంగాణ నుంచి ముగ్గురు..
తెలంగాణ నుంచి ముగ్గురు ఎంపీలు నేరాభియోగాలు ఎదుర్కొంటున్నట్టు సంస్థ తెలిపింది.. ఇందులో సోయం బాపూరావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మాలోతు కవిత ఉన్నారు.