Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దాంతో ఇద్దరు నక్సల్స్ మృతి చెందారు. కన్హాయిగూడ, గోపాండ్ గ్రామాల సమీపంలో కొంటా పోలీస్ స్టేషన్ పరిధిలో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది బృందం అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా మావోలు వారిపైకి కాల్పులు జరిపారు. దీంతో బలగాలు ప్రతిగా కాల్పులు జరుపడంతో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం 8 గంటలకు ఎన్కౌంటర్ చోటుచేసుకున్నట్టు తెలిసింది. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎన్కౌంటర్లో ఇద్దరు మావోలు మృతి చెందినట్టు సుక్మా ఎస్పీ సునీల్ శర్మ ధ్రువీకరించారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.