Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. వివిధ దేశాల్లో ఈ వేరియంట్ కారణంగా లాక్ డౌన్ లు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే డెల్టా వేరియంట్ ను చైనా అడ్డుకుంటోంది. సోమవారం ఆ దేశంలో స్థానికంగా ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాకపోవడం విశేషం. జూలై తర్వాత జీరో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. ది
జూలై 20వ తేదీ నుంచి చైనాలో డెల్టా వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తోంది. నాన్జింగ్ నగరంలో ఉన్న ఎయిర్పోర్ట్ సిబ్బందిలో తొలిసారి డెల్టా కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత 31 ప్రావిన్సుల్లో 1200 కేసులు రిపోర్ట్ అయ్యాయి. దాంతో చైనా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. లక్షలాది మందిని కఠినమైన లాక్డౌన్లో ఉంచారు. భారీ స్థాయిలో టెస్టింగ్, ట్రేజింగ్ చేపట్టారు. స్వదేశీయంగా ప్రయాణాలను నియంత్రించారు. దాంతో డెల్టా కేసులు తగ్గాయి. అయితే చైనాలో సోమవారం విదేశాల నుంచి వచ్చినవారిలో 21 కేసులు నమోదు కాగా, స్థానికంగా మాత్రం ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.