Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నగరవాసులు హాయిగా ట్యాంక్ బండ్ పై సేద తీరేందుకు ఇకపై ప్రతీ ఆదివారం సాయంత్రం అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు తీసుకురావాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పలువురు ట్విట్టర్ లో మంత్రిని కోరడంతో మంగళవారం ఈ మేరకు మంత్రి నిర్ణయం తీసుకున్నారు. ట్యాంక్ బండ్ సందర్శనకు అనుకూలంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని నగర సీపీకి కేటీఆర్ సూచించారు. దాంతో ఇక ప్రతీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ జరిగే అవకాశం ఉంది. ట్యాంక్ బండ్ అందాలను నగరవాసులు ఇక ప్రతీ ఆదివారం ఏ ఆటంకం లేకుండా వీక్షించొచ్చు