Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఓ సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన భుజానికి తీవ్రమైన గాయమైందని అతన్ని వెంటనే లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారని సమాచారం. దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదు. కానీ అభిషేక్ బచ్చన్ హాస్పిటల్లో చేరిన సమయంలో చేతికి బ్యాండేజ్‌తో కూడిన ఫోటోలు బయటకు వచ్చాయి. అలాగే ఆయనను చూడడానికి అమితాబ్ బచ్చన్, శ్వేతా బచ్చన్ తో కలిసి ఆదివారం లీలావతి ఆస్పత్రికి వచ్చినట్టు ఫోటోలు షేర్ అవుతున్నాయి. అయితే గాయం విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.