Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరుద్యోగ జేఏసీ విద్యార్థులు.. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రాష్ట వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1లక్ష 90 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు గోషామహల్‌కు తరలించారు.