Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణలో పాఠశాలల పునః ప్రారంభంపై తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలు తెరిచి, భౌతిక తరగతులు నిర్వహించాలని తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని సూచించింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ సైతం అంగన్వాడీలతో సహా.. రాష్ట్రంలోని అన్ని ప్రయివేటు, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తెరవాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
మరో వైపు రాష్ట్రంలో విద్యా సంస్థల పునః ప్రారంభం సన్నధతపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జెడ్పీ కార్యాలయం నుంచి ఈ సమావేశాన్ని వీడియోకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. సమావేశంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, పురపాలక శాఖల అధికారులు పాల్గొన్నారు.