Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మరోసారి పాకిస్తాన్ వక్రబుద్ధి బయటపడింది. ఉగ్రవాదులకు ఎలాంటి మద్దతు ఇవ్వడంలేదని పాకిస్తాన్ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో అఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లకు మద్దతుగా జైష్, లష్కర్ ఉగ్రవాదులు ర్యాలీలు చేపట్టడంతో పాక్ తీరు పై విమర్శలు వస్తున్నాయి.
తాలిబన్లకు మద్దతుగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లో జైష్-ఇ-మొహమ్మద్ (జేఎం), లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు ర్యాలీ చేపట్టారు. ర్యాలీ తీస్తూ.. గాలిలోకి బుల్లెట్లు కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలు అబ్బాస్పూర్, హజీరా, సెన్సా ప్రాంతాలలో నిర్వహించినట్టు సమాచారం. అలాగే ఓ బహిరంగ సమావేశంలో రెచ్చ గొట్టే ప్రసంగాలు చేసినట్టు తెలుస్తోంది. కొంతమంది పాకిస్తానీ జర్నలిస్టులు కూడా తాలిబాన్ నాయకుడు ముల్లా బరదర్, ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ హమీద్ కలిసి ప్రార్థనలు చేస్తున్న ఫొటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతున్నాయి.