Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాష్ట్ర సంపదంతా దుబారా ఖర్చులకు వాడుతున్నారని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఆర్థిక నివేదిక అసంతృప్తిగా ఉందన చెప్పారు. కాగ్ విమర్శించినా ప్రభుత్వానికి బుద్ధిరాలేదన్నారు. సంపద అంతా హైదరాబాద్ పరిసరాల్లోనే ఉందని చెప్పారు. ఇరిగేషన్‌పై పొదుపు పాటిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. ప్రాజెక్టులపై అంచనాలు పెంచి కమిషన్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు.