Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జమ్మూ-కశ్మీర్ బారాముల్లా జిల్లాలోని సొపోర్‌లో మంగళవారం భద్రతాదళాలు, పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు . ఈ విషయాన్ని కశ్మీర్ పోలీసులు ధ్రువీకరించారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ట్విటర్లో వెల్లడించారు. సొపోర్‌లోని పీఠ్‌శీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతాదళాలు సోమవారం అర్ధరాత్రి కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ముష్కరులు వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. తొలుత ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కొద్దిసేపటికి మరొకరిని గుర్తించారు. వారు ఏ ఉగ్ర సంస్థకు చెందినవారో గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. 24 గంటల వ్యవధిలో 5గురిని ఎన్కౌంటర్ చేసినట్టు వెల్లడించారు. మరోవైపు ఈ ఏడాదిలో ఇప్పటివరకు కశ్మీర్ డివిజన్లో 100కు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు ఐజీపీ విజయ్‌కుమార్ ప్రకటించారు.