Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను చెంప దెబ్బ కొట్టేవాడినని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణెను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి కేంద్ర మంత్రి చేసిన ప్రయత్నాలన్ని విఫలం అయ్యాయి. ముందస్తు బెయిల్ కోసం రత్నగిరి కోర్టు, బాంబే హైకోర్టులకు వెళ్లిన నారాయణ్ రాణెకు రెండు చోట్లా చుక్కెదురైంది. తన ముందస్తు బెయిల్ పిటిషన్పై అత్యవసరంగా విచారించాలన్న పిటిషన్ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు చేసింది. బీజేపీ కార్యాలయాలపై శివసేన కార్యకర్తలు దాడులు కూడా చేశారు.