Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: జాతీయ ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. కోర్టుకు ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, ఎస్ఎస్ రావత్ హాజరయ్యారు. ఇప్పటికే 400కోట్లు చెల్లించామని, మరో వారం రోజుల్లో 1100 కోట్ల బిల్లులు చెల్లిస్తామని అధికారులు వివరణ ఇచ్చారు. పంచాయతీల ఎకౌంట్లలో డబ్బులు జమ చేశామన్న అధికారులు తెలిపారు. దీతో న్యాయవాదులు వీరారెడ్డి, దమ్మాలపాటి శ్రీనివాస్, నర్రా శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ధర్మాసనం దృష్టికి న్యాయవాదులు తీసుకువచ్చారు. పంచాయతీ ఎకౌంట్లలో కాకుండా కాంట్రాక్టర్కు చెల్లించి ఆ వివరాలను హైకోర్టుకు నివేదించాలని ధర్మాసనం ఆదేశించింది.