Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్రంలో స్వచ్ఛమైన కల్లుకు బహిరంగ అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. కల్లును గత ప్రభుత్వాలు చిన్నచూపుతో ప్రజలకు దూరం చేశాయన్నారు. రంగు నీళ్లకు లక్షల రూపాయలు ఖర్చు చేసే ఈ రోజుల్లో, చెట్టు నుంచి వచ్చే స్వచ్ఛమైన కల్లుకు బహిరంగ అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక కులవృత్తులకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. హైదరాబాదులో గౌడ కులస్తులకు 300 కోట్ల విలువైన స్థలాన్ని కేటాయించి, 50 కోట్లతో గౌడ ఆత్మగౌరవ భవనాన్ని నిర్మిస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.