Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కార్వీపై సైబరాబాద్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టారని ఆరోపణల మేరకు కేసు నమోదు చేశారు. కస్టమర్ల షేర్లు తనకా బెట్టి ఐసీఐసీఐ బ్యాంకు నుంచి 500 కోట్ల రుణాన్ని పార్థసారధి పొందారు. ఆయన తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో సైబరాబాద్ పోలీసులకు ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఎకనమిక్ అఫెన్స్ వింగ్‌లో కేసు నమోదు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కార్వీపై మూడు కేసులు నమోదుచేశారు. పార్థసారధిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. రెండు రోజుల కోర్టు అనుమతితో పార్థసారధిని హైదరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకోని విచారణ చేపట్టారు.