Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తీన్మార్ మల్లన్నపై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. సీఎం కేసీఆర్ను కించపరిచేలా వీడియోలు రూపొందిస్తున్నారని టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జర్నలిస్టు వృత్తిని అడ్డుపెట్టుకుని యూట్యూబ్ అడ్డాగా సీఎంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనిపై నమోదైన కేసుల నుంచి తప్పించుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా మల్లన్నపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ ఏసీపీని కోరారు.