Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నగరంలోని నిమ్స్ ఆస్పత్రిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం సందర్శించారు. నిమ్స్ హాస్పిటల్ నందు మౌలిక సదుపాయాలు, వైద్య సేవల మెరుగుదలకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు సమగ్ర నివేదికను సీఎం కేసీఆర్కు అందజేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎమ్ రిజ్వీ, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, సీఎం ఓఎస్డీ డా.గంగాదర్, నిమ్స్ డీన్ డా. రామ్మూర్తి, సూపరింటెండెంట్ డా.సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.